మాసిపోయిన
మరకలు మళ్లీ పైకి లేచాయి. దేనికైనా రెడీ అంటూ బ్రాహ్మణులు మళ్లీ
పడగవిప్పారు. దేనికైనా రేడీ సినిమా వివాదం పై నాంపల్లి కోర్టులో
ఫిర్యాదు దాఖలు చేయడానికి వచ్చిన సినీ నటుడు మంచు విష్ణుకు వ్యతిరేకంగా
బ్రాహ్మణసంఘాలు నిరసనకు దిగాయి. దీంతో కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం
ఏర్పడింది. ఫిర్యాదు దాఖలు చేసిన అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతుండగా
అక్కడికి వచ్చిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు విష్ణుకు వ్యతిరేకంగా పెద్ద
ఎత్తున్న నినాదాలు చేశారు. ఆయన కారును వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు
ఆందోళన చేస్తున్నవారిని పక్కకు తొలగించడంతో విష్ణు అక్కడి నుంచి
వెళ్లిపోయారు. తన తండ్రి మోహన్ బాబుకు బ్రాహ్మణ సంఘాలు పిండప్రదానం
చేయడంపై కోర్టులో 16 మందిపై ప్రైవేటు ఫిర్యాదు చేసినట్లు విష్ణు
చెప్పారు.
No comments:
Post a Comment